
Telangana High Court: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వంగా పరిగణించబోమని వెల్లడించింది. ఇద్దరు ఉద్యోగులుగా ఉన్నప్పుడు భార్య వంట చేయడం లేదని విడాకులు కోరడం సరికాదని పేర్కొంది. తన భార్య వల్ల హింసకు గురవుతున్నానని భర్త వేసిన విడాకుల పిటిషన్ పట్ల తెలంగాణ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. Telangana High Court
Telangana High Court key verdict on wife and husband
ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన ఓ వ్యక్తి, తన భార్య వల్ల హింసకు గురవుతున్నానని, వెంటనే విడాకులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ కేసును తాజాగా విచారించింది తెలంగాణ హైకోర్టు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వంట చేయడం లేదని కారణం చూపి విడాకులు అడగడం సరికాదని ఫైర్ అయింది. Telangana High Court
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డి సర్కార్ పరువు తీసిన గుత్తా..బండారం మొత్తం బయటపెట్టాడుగా ?
భార్య వేరు కాపురం పెట్టేందుకు పోరితే అది క్రూరత్వం కింద పరిగణించాలని వెల్లడించింది. తన భార్య తనతో కంటే పుట్టింట్లో ఎక్కువ ఉంటుందని భర్త చెప్పడంతో… గర్భం దాల్చడంతో తల్లిదండ్రుల వద్ద ఉండటం కూడా క్రూరత్వంగా పరిగణించలేము అని వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. Telangana High Court
Also Read: Roja: రేవంత్, చంద్రబాబుపై రెచ్చిపోయిన రోజా..రాయలసీమకు వెన్నుపోటు ?





