Konda Surekha: బస్వరాజు సారయ్య కుట్ర‌లు…కొండా దంప‌తుల‌ను వీడుతున్న నేత‌లు ?

Konda Surekha
Konda Surekha

Konda Surekha: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొండా సురేఖ ఫ్యామిలీ రాజకీయంగా చాలా బలపడింది. దానికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి కొండా సురేఖ గెలిచారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మహిళా మంత్రిగా కొనసాగుతున్నారు కొండా సురేఖ. ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కొండ సురేఖ, వరుస వివాదాలను ఫేస్ చేస్తున్నారు. Konda Surekha

Baswaraju Sarayya conspiracies Leaders leaving the Konda Surekha

మొన్నటి వరకు సమంత పై కామెంట్స్ చేసిన కొండా సురేఖ స్వారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు కేటీఆర్ వేసిన కేసు నేపథ్యంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే అటు వరంగల్ జిల్లాలో కూడా కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ నేతలు ఉన్నట్లుగా వ్యవహారం నడుస్తోందట. మొదటినుంచి ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొండ మురళి కాస్త రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారని చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంకా లేటెస్ట్ గా వరంగల్ తూర్పులో రాజకీయ పరిణామాలు మారినట్లు తెలుస్తోంది. కొండ కుటుంబాన్ని ఆయన అనుచరులు వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గుడికి కొండ అనుచరులు వెళుతున్నట్లు సమాచారం. Konda Surekha

Also Read: Anchor Shyamala: టాలీవుడ్ యాంక‌ర్ శ్యామల భర్త అరెస్ట్

కొండ అనుచరుడిగా ఉన్న వరంగల్ డిసిసి ఆయుబ్, సారయ్య వర్గంలో చేరిపోయారు. కొండ వీరాభిమానిగా ఉన్న నల్గొండ రమేష్ కూడా ఆయనకు దూరమయ్యారు. కొండా వ్యతిరేక వర్గం మొత్తం ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గ్రూప్లో చేరిపోతోంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొండ కుటుంబాన్ని అనుచరులు వీడడంతో సురేఖ దంపతులు ఆందోళన చెందుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తన అనుచరులను బసవరాజు సారయ్య తన గ్రూపులో చేర్చుకోవడంతో కొండ మురళి ఆగ్రహంతో ఉన్నారట. దీంతో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి. Konda Surekha

Also Read: PM MODI: మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్..తెలంగాణ ఎంపీల ప‌రువు తీసిన ప్ర‌ధాని మోడీ…

https://twitter.com/bigtvtelugu/status/1999410881701060758?s=20
Share your love