
IBomma Ravi: ఐ బొమ్మ ద్వారా కోట్లు సంపాదించిన ఇమ్మాడి రవి తాజాగా పోలీసుల చేతికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అని పోలీసులనే సవాల్ చేసిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు ఆయన చేతే ఐ బొమ్మ, బప్పం వంటి వెబ్సైట్లను బ్లాక్ చేయించారు.
If you know the background of IBomma Ravi
కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలను నష్టాల పాలు చేసి ఐ బొమ్మలో సినిమాలు పెట్టె ఇమ్మాడి రవి ఈ రంగంలోకి రాకముందు ఏం చేసేవాడు.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..(IBomma Ravi)
Also Read: IBomma: ఐ బొమ్మ నిర్వాహకుడిని భార్యే దగ్గరుండి పట్టించిందా.?
ఇమ్మడి రవి ముంబైలోని యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు.ఆ తర్వాత ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఆ కంపెనీకి సీఈఓ కొనసాగారు. ఆ తర్వాత హ్యాకర్ గా మారి ఎలాంటి సెక్యూర్ లో ఉన్న సర్వర్లను అయినా సరే హ్యాక్ చేసే స్థాయికి ఎదిగి చివరికి కొత్త సినిమాలు ఉండే క్లౌడ్ ఫైర్ సర్వర్ ని హ్యాక్ చేసి కొత్త కొత్త సినిమాలను ఐ బొమ్మ అనే వెబ్సైట్లో పెట్టి కోట్లు సంపాదించాడు.

అలా సెప్టెంబర్ లో ఆయన అనుచరులు దొరకడంతో అలర్ట్ అయిన ఇమ్మడి రవి వెంటనే హైదరాబాద్ నుండి నెదర్లాండ్ కి పారిపోయి అక్కడి నుండి ఫ్రాన్స్, కరేబియన్ దీవులను అడ్డాగా మార్చుకొని కొత్త సినిమాలు పెడుతూ అక్కడే తలదాచుకున్నారు. కానీ రీసెంట్ గా తన భార్యకు విడాకులు ఇవ్వడం కోసం ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవిని ఆయన భార్య సైబర్ పోలీసులకు తెలియజేసి పట్టించింది.(IBomma Ravi)



Ibomma Ravi:”అమీర్పేట్ లో కలిసిన మాయలాడి” వల్లే ఐబొమ్మ రవికి ఈ గతి పట్టిందా.!