
CM REVANTH REDDY : ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ట వినోబా నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 60 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న సుమారు 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున ఆపరేషన్ చేపట్టింది. నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులు మోహరించారు. అధికారులు జేసీబీల సహాయంతో గుడిసెల కూల్చివేతలను ప్రారంభించారు. CM REVANTH REDDY
CONGRESS JCB ON POOR HOUSES IN KHAMMAM
దాదాపు 60 ఎకరాల భూదాన్ భూముల్లోని 600 కుటుంబాలను ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. జేసీబీలతో గుడిసెలను అధికారులు కూల్చివేయిస్తుంటే.. స్థానికులు ప్రతిఘటిస్తున్నారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేశారు. అక్రమంగా కూల్చివేతలకు ప్రభుత్వం తెగబడుతోంది. అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నామని.. కూల్చితే ఎటు వెళ్లాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల కోసమే ప్రభుత్వం ఇళ్లను కూల్చేస్తుందని ఆరోపిస్తున్నారు బాధితులు. CM REVANTH REDDY
Also Read : HARISH RAO : ఫ్యూచర్ సిటీ మీద పెట్టిన శ్రద్ధ.. హెల్త్ సిటీ మీద పెడితే బాగుండేది
ముఖ్యంగా ఎన్నికల సమయంలో రేవంతన్న, శీనన్న అని ఓట్లు వేసి గెలిపిస్తే.. తగిన శాస్త్రీ అయిందని బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొంత మంది యువకులు పోలీసులను ప్రతిఘటించేందుకు కర్రలతో సిద్ధం అవ్వడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దాదాపు ఏడాది కాలం నుంచి కరెంట్ లేదు, నీళ్లు లేవని.. ఒక్కరోజు తిని తినక పస్తులుంటున్నామని వాపోతున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తే.. తమ బ్రతుకు ఎటు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం.
Also Read : FOOT BALL : ఫుట్‌బాల్ గ్రౌండ్ టెండర్లలో గోల్‌మాల్





