మనం ఎన్ని గంటలు పని చేస్తే మన ఆరోగ్యానికి మంచిది? ఇటీవల ఓ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ చెప్పిన వివరాలు మనకు షాక్ ఇస్తాయి. ఎక్కువ work hours పెట్టడం వల్ల స్ట్రోక్, గుండె జబ్బుల రిస్క్ ఎంత పెరుగుతుందో ఈ research చూపిస్తోంది.
Work Hours Health Risks Revealed
వారానికి 35 నుంచి 40 గంటలు పని చేయడమే ideal range అని, అది ఆరోగ్యానికి సేఫ్ అని డాక్టర్ చెప్పారు. కానీ 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేసే వాళ్లలో స్ట్రోక్ రిస్క్ 35% ఎక్కువ ఉంటుంది. అలాగే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ రిస్క్ 17% పెరుగుతుంది. WHO మరియు ILO 2016 నాటి రిపోర్ట్ ప్రకారం, ఎక్కువ గంటల పని ప్రపంచవ్యాప్తంగా 745,000 మరణాలకు కారణమైంది.
ఇంకా, ఎక్కువ సమయం పనిచేయడం వల్ల స్లీప్ డిస్టర్బెన్స్, బర్న్అవుట్, యాన్సైటీ, డిప్రెషన్ వంటివి వస్తాయి. బ్లడ్ ప్రెషర్ పెరగడం, ప్రొడక్టివిటీ క్షీణించడం, వర్క్ ప్లేస్ ఇంజ్యూరీలు ఎక్కువవుతాయి. వ్యాయామం చేసే టైం లేకపోవడం, హెల్దీ ఫుడ్ తినలేకపోవడం తదితర సమస్యలు వస్తాయి.
చివరగా, డాక్టర్ సుధీర్ కుమార్ advice ఇస్తూ, లక్ష్యం తక్కువ పని చేయడం కాదు, స్మార్ట్ గా పని చేయడం మరియు మంచి రికవరీ తీసుకోవడం అని చెప్పారు. ప్రతి రాత్రి 7-9 గంటలు స్లీప్ తీసుకోవడం, రెగ్యులర్ వ్యాయామం చేయడం, వారానికి కనీసం ఒక రోజు పూర్తి రెస్ట్ తీసుకోవడం వంటివి సూచించారు. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే నిజమైన విజయం.




