Annapurna Ramanaidu Studios: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా GHMC

Annapurna Ramanaidu Studios: జనాలందరూ ఐ బొమ్మ రవి పై ఫోకస్ పెడితే, జిహెచ్ఎంసి మాత్రం అన్నపూర్ణ స్టూడియో అలాగే రామానాయుడు స్టూడియోలపై కన్నేసింది. పాత బకాయిలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే నోటీసులు కూడా జారీ చేసింది బల్దియా. వివరాల్లోకి వెళితే, అన్నపూర్ణ స్టూడియో అలాగే రామానాయుడు స్టూడియో లకు ( Annapurna Ramanaidu Studios) జిహెచ్ఎంసి ఊహించని షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్న స్టూడియోలు, తమ వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగబడుతున్నారట. Annapurna Ramanaidu Studios

GHMC Issues Notices to Annapurna, Ramanaidu Studios

ఈ కేసులో భాగంగా అన్నపూర్ణ స్టూడియో తో పాటు రామానాయుడు స్టూడియోలకు నోటీసులు విడుదల చేసింది జిహెచ్ఎంసి. దాదాపు 11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా, కేవలం 49 వేల రూపాయలు మాత్రం అన్నపూర్ణ స్టూడియో చెల్లిస్తోందట. అంటే వన్ పర్సెంట్ కూడా అన్నపూర్ణ స్టూడియో చెల్లించడం లేదన్నమాట. అటు 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియో కేవలం 1900 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు జిహెచ్ఎంసి సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. Annapurna Ramanaidu Studios

Also Read: KCR: “గద్ద ముక్కు” అంటూ కేసీఆర్ పై రెచ్చిపోయిన ఏపీ మంత్రి.. BRS అదిరిపోయే…

ఇందులో భాగంగానే పూర్తిస్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. దీనిపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సామాన్యుడు ఐ బొమ్మ ద్వారా జనాలకు సినిమాలో అందిస్తుంటే, అన్నపూర్ణ అలాగే రామానాయుడు స్టూడియోలు మాత్రం జనాల సొమ్మును వెనకేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవిని వదిలేసి ఈ బడ సినిమా స్టార్లను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Annapurna Ramanaidu Studios

Also Read: YS Jagan: హైద‌రాబాద్ లో జ‌గ‌న్ ఎంట్రీ..రప్పా రప్పా పోస్ట‌ర్ల క‌ల‌క‌లం