
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. డిసెంబర్ 11 అంటే నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. Bhatti Vikramarka
ycp and brs big shock to Bhatti Vikramarka
డిప్యూటీ భట్టి విక్రమార్క ఇలాకాలో బీఆర్ఎస్, వైసీపీ ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలో 1090 ఓట్లతో గెలుపొందిన బీఆర్ఎస్, వైసీపీ ఉమ్మడి అభ్యర్థి, కాంగ్రెస్ షాక్ ఇచ్చారు. 13 వార్డుల్లో 11 స్థానాలు బీఆర్ఎస్, వైసీపీ ఉమ్మడి అభ్యర్థులు గెలుపొందగా, కేవలం రెండు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. Bhatti Vikramarka
Also Read: PM MODI: మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్..తెలంగాణ ఎంపీల పరువు తీసిన ప్రధాని మోడీ…
ఇక అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌కు చుక్కెదురు అయింది. మురళీ నాయక్ సొంత ఊరిలో ఆయన వదిన, కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా కౌసల్య ఓడిపోయారు. మహబూబాబాద్ మండలం సోమ్లా తండాల్లో 27 ఓట్లతో గెలిచారు ఇస్లావత్ సుజాత అనే మహిళ. దీంతో ఈ స్థానిక సంస్థలు హాట్ టాపిక్ అయ్యాయి. Bhatti Vikramarka
Also Read: Anchor Shyamala: టాలీవుడ్ యాంకర్ శ్యామల భర్త అరెస్ట్




















