నాగార్జున కూలీ మూవీలో విలన్ గా నటించాడు. ఫస్ట్ టైమ్ నాగ్ విలన్ గా నటించడంతో ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. అయితే కూలీలో సైమన్ అక్కినేని ఫ్యాన్స్ కు నచ్చలేదనే టాక్ వినిపిస్తోంది. కూలీ సినిమాలో నాగార్జున సైమన్ పాత్ర బాగుంటుందని..ఈ పాత్రే హైలైట్ అవుతుందని ప్రమోషన్స్ లో చెప్పారు.
కానీ తీరా సినిమా చూస్తే ఈ పాత్రను నాగార్జున ఎందుకు ఒప్పుకున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. ఇంకా హీరోగా నటిస్తుంటే నాగార్జున మాత్రం విలన్ గా నటించడం అవసరమా అంటూ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇక ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ చేయకపోవడమే మంచిదంటూ అభిమానులు సూచిస్తున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ ను నాగార్జున ఎలా తీసుకుంటారో చూడాలి.





