ఎమోషన్ తో ఆకట్టుకోనున్న “పెద్ది”

రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే స్పోర్ట్స్ సినిమా ఇది. రెండు మూడు రకాల ఆటల నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో ఎమోషన్స్ బాగానే ఉంటాయట. ఎమోషన్స్ తోనే ప్రేక్షకుల్ని పెద్ది ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుందని తెలుస్తోంది.

ఇటీవల జాన్వీ కపూర్, రామ్ చరణ్ కాంబోలో సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ఓ సాంగ్ షూట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. రామ్ చరణ్, శివరాజ్ కుమార్ మధ్య వచ్చే సీన్స్ పవర్ ఫుల్ గా ఉంటాయట. ఈ పాన్ ఇండియా మూవీని మార్చి 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

Share your love