“బేబి” మూవీ టీమ్ కు సీఎం రేవంత్ సత్కారం

తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలిపిన బేబీ సినిమా టీమ్ ను సత్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. నేషనల్ ఫిలిం అవార్డ్స్ విజేతలను తన నివాసంలో కలిసి అభినందించారు సీఎం. బేబి సినిమా నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్ కేఎన్, సింగర్ రోహిత్ లకు శాలువా కప్పి సత్కరించారు. బేబి సినిమా రెండు జాతీయ అవార్డ్స్ గెలవడం గర్వకారణమని, హైదరాబాద్ ను ఇండియన్ మూవీకి హబ్ గా మార్చేందుకు అందరం కృషి చేయాలని సీఎం రేవంత్ అన్నారు.

తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. 71 జాతీయ అవార్డ్స్ లో బేబి సినిమా రెండు అవార్డ్స్ గెల్చుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్ పురస్కారం దక్కించుకున్నారు.

Share your love