టాలీవుడ్ లో జరుగుతున్న సమ్మెకు ముగింపు పలికేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. గత 16 రోజులుగా సినీ కార్మికుల సమ్మెతో షూటింగ్స్ నిలిచిపోయాయి. 30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు, అంత పెంచలేమని పట్టుదలగా ఉన్నారు. దీంతో మెగాస్టార్ రంగంలోకి దిగారు. నిర్మాతలతో పాటు కార్మికులతో కూడా సమావేశం అయ్యారు. ఉదయం నిర్మాతలతో సమావేశమై వాళ్ల ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకున్నారు.
సాయంత్రం కార్మికులతో సమావేశమై వాళ్ల కష్టాలు ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు. ఒకరిద్దరితో కాకుండా 24 క్రాఫ్టులకు సంబంధించిన 70 మందితో సమావేశం అయ్యారు మెగాస్టార్. రెండు వర్గాల వాదనలు విని చిరంజీవి మధ్యే మార్గంగా కొన్ని సూచనలు చేశారట. ఈ సూచనల ఆధారంగా నిర్మాతలు, కార్మికులు సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించుకోబోతున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సమస్యకు మెగాస్టార్ చొరవతో పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి.





