పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీ ఓజీ. ఈ భారీ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఓజీ ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్ దక్కించుకుంది.
తమన్ అదిరిపోయే సాంగ్ ఇవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా సెకండ్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓజీ సెకండ్ సింగిల్ ను నెక్ట్స్ వీక్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆరోజు ఓజీ నుంచి అదిరిపోయే ట్రీట్ ఉండబోతోందట. పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.




















