సక్సెస్ ఫుల్ గా మ్యూజికల్ ప్రమోషన్స్ జరుపుకుంటోంది రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ నదివే..నువ్వు నదివే..ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. లవ్ స్టోరీ మూవీస్ ను ముందుగా ఆడియెన్స్ కు రీచ్ చేసేది మంచి మ్యూజిక్కే. ఇలా రీచ్ అయ్యే మంచి సాంగ్స్ హేషమ్ అబ్దుల్ వాహన్ కంపోజ్ చేశారు. ఏం జరుగుతోంది అని సాగే సెకండ్ సింగిల్ ను ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాట ప్రేమ జంట మనసుల్లో ఏం జరుగుతోంది అనేది తెలియజేయనుంది. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.





