స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. రక్తచరిత్ర తర్వాత సూర్య తెలుగులో చేస్తున్న స్ట్రైట్ ఫిలిం ఇదే. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సూర్యను వెంకీ అట్లూరి రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించనున్నాడని..ఇందుకోసం బలమైన కథ, కథనం రెడీ చేశాడని టాక్ వినిపిస్తోంది.
ఈ రెండు పాత్రల్లో ఒకటి హీరో క్యారెక్టర్ అయితే..రెండోది విలన్ క్యారెక్టర్. సూర్య గతంలో 24 సినిమాలో హీరోగానూ, విలన్ గానూ నటించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడట. అయితే గతంలో సక్సెస్ కాని ఆ ప్రయత్నం ఈ సారి ఫలిస్తుందనే నమ్మకంతో సూర్య ఉన్నాడట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది.





