
Rashmika Mandanna: రష్మిక మందన్నా విజయ్ దేవరకొండల ప్రేమ వార్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటాయి. వీరిద్దరి పెళ్లి ఎప్పుడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ అయింది అనే వార్త సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.అయితే ఈ ఎంగేజ్మెంట్ వార్తలు రావడానికి ప్రధాన కారణం రష్మిక చేతికి గత కొద్దిరోజులుగా ఓ స్పెషల్ రింగ్ కనిపించడమే.
Rashmika Mandanna leaked her engagement
అంతే కాకుండా తన చేతి వేలికి ఉన్న రింగ్ ని అందరికీ కనిపించేలా ఫోటోలకు ఫోజులివ్వడంతో చాలామంది నెటిజెన్లు రష్మిక మందన్నా విజయ్ దేవరకొండల ఎంగేజ్మెంట్ రహస్యంగా జరిగినట్టు మాట్లాడుకున్నారు. అయితే ఈ విషయం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తాజాగా తన ఎంగేజ్మెంట్ పై స్పందించింది రష్మిక మందన్నా. (Rashmika Mandanna)
Also Read: Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్.. “త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా అంటూ తమన్నా గుడ్ న్యూస్”.!!
తాజా ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. నా ఎంగేజ్మెంట్ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.నా ఎంగేజ్మెంట్ జరగలేదు. ఎంగేజ్మెంట్ చేసుకుంటే మీ అందరికీ చెప్పే చేసుకుంటాను.అలాగే నా చేతి వేలికి ఉన్న రింగు ఎంగేజ్మెంట్ రింగ్ అయితే కాదు. అది నా సెంటిమెంట్ రింగ్ అంటూ రష్మిక ఎంగేజ్మెంట్ వార్తలకు చెక్ పెట్టింది. ఇక రష్మిక విజయ్ దేవరకొండ లవ్ బర్డ్స్ గా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు.

అలా సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లకి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక రష్మిక ఈ ఏడాది కుబేర, ఛావా వంటి సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది.కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ ఏడాది కింగ్డమ్ మూవీ తో వచ్చినప్పటికీ ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.(Rashmika Mandanna)





