
Bananas: అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పండ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచి లాభాలను అందిస్తుంది. అరటి పండ్లను అధికంగా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటి పండ్లు తిన్నట్లయితే చాలా బలంగా, యాక్టివ్ గా తయారవుతారు. చిన్న పిల్లలకు ప్రతిరోజూ ఒక అరటి పండును తప్పకుండా తినిపించడం వల్ల వారి పెరుగుదల బాగుంటుంది. ఎలాంటి లోపాలు లేకుండా ఉంటారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చాలా యాక్టివ్ గా, బలంగా తయారవుతారు. చిన్న పిల్లలకు అరటిపండు తప్పకుండా తినిపించాలని వైద్యులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. దానివల్ల చిన్న పిల్లలకు అధిక బలం చేకూరుతుంది. Bananas
Also Read: Chanakya Niti: మహిళల్లో ఈ లక్షణాలు ఉంటె ప్రమాదమే !
Is it safe to eat Bananas in monsoon
ఇక కొంతమంది చిన్నపిల్లలు అరటి పండ్లు తినడానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటివారు జ్యూస్ రూపంలో తయారు చేసి తాగించవచ్చు. ఏ రూపంలో అయినా సరే చిన్నపిల్లలకు అరటిపండు తినిపించాలి. అరటిపండు ఏ సీజన్లో అయినా సరే దొరుకుతాయి. అతి తక్కువ ధరకే మార్కెట్లలో ఇవి లభిస్తాయి. ఇవి ఎంతో తీయగా రుచికరంగా ఉంటాయి. అరటిపండు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా లాంటి సమస్యలు ఉన్నట్లయితే అరటిపండు తినడం వల్ల వ్యాధులు తొందరగా పోతాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు వచ్చిన సమయంలో అరటిపండు తప్పకుండా తినాలి. అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని అధికంగా తిన్నట్లయితే ప్రమాదం కూడా వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అరటి పండును డయాబెటిక్ పేషెంట్లు అసలు తినకూడదు. అరటి పండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది. డయాబెటిక్ పేషంట్లు అరటి పండ్లు తిన్నట్లయితే వారి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయి. దానివల్ల షుగర్ లెవెల్ అధికంగా పెరుగుతుంది. Bananas
Also Read: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేకే సర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్టరీ ?
దాంతో డయాబెటిక్ పేషెంట్లు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు వీలైనంతవరకు అరటిపండును తినకపోవడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు సైతం అరటిపండు తింటే ఏమవుతుంది అనే భ్రమలో ఉంటారు. కానీ అలా అస్సలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇక అరటి పండ్లు అన్ని సీజన్లలో దొరుకుతాయి. అలా అని వర్షాకాలంలో అరటి పండ్లను తినకూడదు. వర్షాకాలంలో తేమ కారణంగా అరటి పండ్లలో చిన్నచిన్న కీటకాలు, క్రీములు ఏర్పడతాయి. అలాంటి అరటి పండ్లను తిన్నట్లయితే అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. చర్మ సంబంధ సమస్యలు అధికంగా ఏర్పడతాయి. వర్షాకాలంలో వీలైనంతవరకు అరటిపండును తినకపోవడమే మంచిది. వర్షాకాలంలో మాత్రం అరటి పండుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మిగతా సమయాలలో ఎప్పుడైనా అరటిపండును తినవచ్చు.
Also Read: Ridge Gourd: బీరకాయ ప్రతిరోజు తింటున్నారా..అయితే ఒక్కరిసారి ఇవి తెలుసుకోండి?




















