
Soundarya: సౌందర్య రాజకీయ ప్రచారం కోసం ఫ్లైట్లో కరీంనగర్ కు వస్తున్న సమయంలో ఫ్లైట్ క్లాష్ అయ్యి ఫ్లైట్లో ఉన్న అందరూ చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే సౌందర్య చనిపోయిన తర్వాత చిత్ర పరిశ్రమ సౌందర్య మరణాన్ని తలుచుకొని ఎంతలా బాధ పడిందో చెప్పనక్కర్లేదు. అయితే సౌందర్య మరణించి ఇన్ని సంవత్సరాలైనా ఆమెను జనాలు మర్చిపోలేదు. అంతలా సినిమాల ద్వారా సౌందర్య ప్రేక్షకుల్లో గుండెల్లో గూడు కట్టుకుంది.
Another heroine who will die with Soundarya that day
అయితే అలాంటి సౌందర్య విమాన ప్రమాదంలో మరణించిన సమయంలో మరో హీరోయిన్ కూడా సౌందర్య తో పాటే ప్రాణాలు విడిచేదట.కానీ అదృష్టం కొద్దీ ఆ హీరోయిన్ బతికి బయటపడిందట. మరి ఇంతకీ సౌందర్య తో పాటు విమాన ప్రమాదంలో చనిపోవాల్సిన మరో హీరోయిన్ ఎవరు అనేది చూస్తే ఆమె ఎవరో కాదు . హీరోయిన్ మీనా.. అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే స్వయంగా మీనా ఈ విషయాన్ని తాజా టాక్ షో లో బయటపెట్టింది.మీనా తాజాగా జగపతిబాబు హోస్ట్ గా చేసే జయమ్ము నిశ్చయమ్మురా షోలో పాల్గొంది.(Soundarya)
Also Read: Hero: పవన్ కళ్యాణ్ అత్తను ప్రేమించి మరో హీరోయిన్ ని పెళ్లాడిన హీరో.!
అయితే ఈ షోలో సౌందర్య మరణం గురించి తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాదు సౌందర్య ఆరోజు ఏ విమాన ప్రమాదంలో అయితే మరణించిందో ఆ విమానంలో నేను కూడా వెళ్లాల్సి ఉంది.ఎందుకంటే సౌందర్య వెళ్లే క్యాంపేనింగ్ కి నన్ను కూడా ఆహ్వానించారు.కానీ షూటింగ్ ఉండటం వల్ల నేను వెళ్లలేక పోయాను. లేకపోతే ఆరోజు నేను కూడా విమాన ప్రమాదంలో మరణించేదాన్ని.

ఇక సౌందర్య మరణ వార్త వినగానే నాకు చెమటలు పట్టేసాయి. ఆమె మరణాన్ని నేను తట్టుకోలేక పోయాను అంటూ ఎమోషనల్ అయింది మీనా. ఇక మీనా మాటలు విన్న చాలా మంది నెటిజన్లు నీకు భూమి మీద ఇంకా నూకలు తినే యోగం ఉంది అందుకే బతికి బయటపడ్డావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Soundarya)





Devi Sri Prasad: పెళ్లిపై దేవి శ్రీ ప్రసాద్ ఊహించని కామెంట్స్.. ఇక లైఫ్ లో అది జరగదు.!