Jagapathi Babu: నన్ను పెళ్లి చేసుకో నీకు ఎదురు కట్నం ఇస్తా.. జగపతి బాబుకి హీరోయిన్ ఆఫర్.!

Heroine offer to Jagapathi Babu

Jagapathi Babu: ఏంటి ఆ హీరోయిన్ జగతిబాబు ని పెళ్లి చేసుకొని కోట్ల కట్నం ఇస్తానని చెప్పిందా.. నిజంగానే జగపతిబాబుని ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకుందా.. ఎదురు కట్నం ఇచ్చి మరీ జగపతిబాబుని పెళ్లి చేసుకోవాలని అనుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జగపతిబాబు ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కూడా.. అయితే జగపతిబాబు సినిమాల్లోకి వచ్చాక చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వినిపించాయి.

Heroine offer to Jagapathi Babu

అందులో మొదట వినిపించేది సౌందర్య..ఆ తర్వాత కళ్యాణి, ప్రియమణి వంటి హీరోయిన్ల విషయంలో కూడా జగపతిబాబు ఎఫైర్ పెట్టుకున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇవేవీ నిజం కాదు. అయితే గతంలో ఒక వార్త వినిపించింది. అదేంటంటే హీరోయిన్ కళ్యాణి జగపతిబాబు దగ్గరికి వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకో..నీకు అన్ని కోట్లు ఇస్తానని చెప్పినట్టు ఓ రూమర్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని జగపతిబాబు ఓ సందర్భంలో చెప్పినట్టు ఆ రూమర్ లో ఉంది. (Jagapathi Babu)

Also Read: Kajal: కాజల్ ని అర్ధరాత్రి పిలిచినా నా ఇంటికి వస్తుంది.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్.!

నా దగ్గరికి ఒకసారి కళ్యాణి వచ్చి పెళ్లి చేసుకోమని అడిగింది.నేను దానికి నో చెప్పాను. కానీ కళ్యాణి వినకుండా నీకు భరణం కింద 22 కోట్లు ఇస్తాను.నన్ను పెళ్లి చేసుకో అని చెప్పింది. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకు నీ డబ్బులు వద్దు. నువ్వు నాకు ఇవ్వాలనుకున్న డబ్బులతో పేద వాళ్లకు ఇల్లు కట్టించు నేను సంతోషిస్తా అని జగపతిబాబు చెప్పారట. ఇక జగపతిబాబు మాటలు సీరియస్ గా తీసుకున్న కళ్యాణి ఆ డబ్బుతో పేదవాళ్లకు ఇల్లు కట్టించిందట.

Heroine offer to Jagapathi Babu

ఇక ఈ విషయం తెలిసిన జగపతిబాబు అంత మంచి అమ్మాయిని నేను ఎందుకు మిస్ చేసుకున్నానో అని బాధపడ్డాను అంటూ ఓ సందర్భంలో చెప్పినట్టు ఒవీడియో వైరల్ అవుతుంది.మరి ఇందులో ఉన్నది ఎంత నిజమో తెలియాల్సి ఉంది. ఇక జగపతిబాబు కళ్యాణి కాంబినేషన్లో పెదబాబు, కబడ్డీ కబడ్డీ,పందెం వంటి సినిమాలు వచ్చాయి.(Jagapathi Babu)

https://youtube.com/shorts/lvpKk_auChY?si=-NuG-jgeuv7-A9EO
Share your love