
OG movie: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన ఓజీ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. మరో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ కూటమి ప్రభుత్వం. ఒక్కో టికెట్ ధర వెయ్యి రూపాయలు ఫిక్స్ చేసింది. అయితే ఇది బెన్ఫిట్ షో కి మాత్రమే వర్తించనుంది. దీనిపై వైసీపీ ట్రోలింగ్ మొదలుపెట్టింది. OG movie
Also Read: Nela Usiri: నేల ఉసిరి మొక్క గురించి మీకు తెలుసా..? ఇది తింటే 100…
ycp party trolls on OG movie tickets rates
ఏపీలో రైతులు అలాగే కార్మికులందరూ… సరైన కూలీ లేక ఇబ్బందులు పడుతున్నారని… వైసిపి పార్టీ స్పష్టం చేస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం… భారీగా టికెట్ల ధరలు పెంచుతున్నారని మండిపడుతోంది. ఇలా సినిమాలు చేయడం ఎందుకు? టికెట్ల ధరలు పెంచడం ఎందుకని నిలదీస్తోంది వైసిపి. టమాటా అలాగే ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేస్తుంది.
Also Read: Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?
ఇది అధికార దుర్వినియోగం కాదా అని వైసిపి పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ఇలా ఉండగా… భోగి సినిమా బెనిఫిట్ షో కు 1000 రూపాయలు… పెంచుకునేలా అనుమతి ఇచ్చింది కూటమి ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్ కు 125 రూపాయలు అలాగే మల్టీప్లెక్స్ కు 150 పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది.
Also Read: Komatireddy Raj Gopal Reddy: నేపాల్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూల్చే ప్రమాదం ?




















