
Prabhas: ఏంటి కల్కి మూవీలో ప్రభాస్ జోకరా.. అంత పెద్ద హిట్ అయిన సినిమాలో ప్రభాస్ ని జోకర్ ని ఎలా చేసేస్తారు.. ప్రభాస్ జోకర్ అంటూ ట్వీట్లు ఎలా చేస్తారు..అంటూ మండిపడుతున్నారు ఆయన అభిమానులు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్.. అలాంటిది ఆయన పైనే ఇలాంటి జోక్స్ వేస్తే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. మరి ఇంతకీ ప్రభాస్ ని జోకర్ అంటున్నది ఎవరు..
Prabhas is a joker in Kalki Sensational tweet goes viral
ఎందుకు ఇలాంటి ట్వీట్లు వైరల్ అవుతున్నాయి అనేది చూస్తే రీసెంట్గా కల్కి సీక్వెల్ నుండి దీపికా పదుకొనే ను తొలగిస్తున్నట్టు చిత్ర యూనిట్ ఆఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ ప్రకటన వచ్చినప్పటినుండి సోషల్ మీడియాలో దీపిక ఫ్యాన్స్,సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా కొంతమంది బ్యాచులు బ్యాచులుగా విడిపోయి ఒకరిపై ఒకరు నెగటివ్ కామెంట్లు చేసుకుంటున్నారు. (Prabhas)
Also Read: Deepika Padukone: ఛీ నువ్ ఆడదానివేనా.. స్టార్ హీరోతో ఏకంగా 6 సార్లు.. దీపిక పదుకొనేపై ఫైర్.!
ఈ నేపథ్యంలోనే ప్రభాస్ గురించి ఓ వ్యక్తి ట్వీట్ చేస్తూ అసలు కల్కి మూవీలో ప్రభాస్ ఏమీ చేయలేదు. ఆయన ఫస్టాఫ్ మొత్తం జోకర్ లా కనిపించారు. ప్రతి దానికి నవ్వుకుంటూ జోకులు వేస్తూ జోకర్ లాగ కనిపించాడు.ప్రభాస్ నటించిన కల్కి మూవీకి 900 కోట్లు వస్తే అందులో 300 కోట్లు దీపిక పదుకొనే ఇంటర్వెల్ సీన్ కే వచ్చాయి.ఇంటర్వెల్ సీన్ లో దీపిక చాలా అద్భుతంగా నటించింది. మంటల్లో నుండి చాలా ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ దీపిక ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్..

ఈ ఒక్క ఇంటర్వెల్ సీన్ కే సినిమాపై హోప్స్ పెరిగేసాయి.ఇంటర్వెల్ తర్వాత చూడ్డానికి చాలామంది ఆసక్తి కనబరిచారు. అంతేకానీ ప్రభాస్ నటనని చూసి కాదు.ప్రభాస్ ఇందులో ఒక జోకర్ అంటూ ట్వీట్ పెట్టాడు. అయితే ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ట్వీట్ పై ఫైర్ అవుతున్నారు. మీరు మీరు కొట్టుకొని మధ్యలో ప్రభాస్ ని జోకర్ చేశారు కదరా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Prabhas)





