
Prabhas: ఏంటి ప్రభాస్ ఫోన్ ని మరో హీరో దొంగలించారా.. అంత చీప్ పనులు చేయాల్సిన అవసరం ఆ హీరోకి ఏముంది.. కనీసం ఫోన్ కొనుక్కొని స్థితిలో ఉన్నారా.. ప్రభాస్ ఫోనే దొంగలించాల్సి వచ్చిందా.. అంటూ ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.అయితే ప్రభాస్ ఫోన్ కొట్టేయాలని చూసిన ఆ హీరో ఎవరయ్యా అనేది చూస్తే ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీ సింహ..
The hero who stole Prabhas phone
అవును మీరు వినేది నిజమే.. శ్రీ సింహ ఓ సినిమా ఈవెంట్లో ప్రభాస్ ఫోన్ కొట్టేయాలని చూశారు.ఇక అసలు విషయం ఏమిటంటే..శ్రీ సింహా, కమెడియన్ సత్య, ఫరియా అబ్దుల్లా కలిసి నటించిన మత్తు వదలరా-2 మూవీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ మూవీకి సపోర్ట్ గా అప్పట్లో ప్రభాస్ ఈవెంట్ కు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.(Prabhas)
Also Read: Sharwanand: భార్యతో శర్వానంద్ విడాకులు.. దాని వల్లేనా.?
అయితే ఈ మూవీ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ ఉండగా ఆయన చూడట్లేదు కదా అని ప్రభాస్ ఫోన్ దొంగలించాలని చూసారు శ్రీ సింహ. కానీ ప్రభాస్ శ్రీ సింహ చేసే పనిని గమనించి వెంటనే తన ఫోన్ ని తెలివిగా లాక్కున్నాడు. ఇక ఇదంతా చూస్తూ నిలబడిపోయిన సత్య ప్రభాస్ వెరీ టాలెంటెడ్ అని అనుకున్నాడు.

ఆ తర్వాత ప్రభాస్ చూపించిన కోపానికి సత్య కూడా భయపడిపోయాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్లు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఏదో కామెడీ కోసం ఫన్నీగా శ్రీ సింహ అలా ఈవెంట్లో చేశారు తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.(Prabhas)





