
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న తాజా మూవీ ఓజి.. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఓజి మూవీ చూడడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుండి ప్రీమియర్ షోస్ కూడా పడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసిపి వాళ్లు ఓజీ మూవీ విడుదల అవుతుంటే మేం క్రియేట్ చేసే మీమ్స్ లేకుండా ఎలా అనుకున్నారో ఏమో కానీ ఓజి మూవీ ని టార్గెట్ చేసేసారు..
YCP changed the name of OG Movie
వైసిపి ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటి నుండి పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా సమయంలో వైసీపీ పవన్ కళ్యాణ్ పై ఘోరమైన ట్రోలింగ్ చేసింది. అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఓజీ మూవీ పై కూడా వైసిపి ట్రోల్స్, మీమ్స్ మొదలెట్టింది.అయితే సుజీత్ డైరెక్షన్ చేసిన ఓజీ మూవీ ఫుల్ ఫామ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని చెప్పారు. (OG Movie)
Also Read: Pawan Kalyan: ఓజి ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ధరించిన దాని గురించే ఇప్పుడు హాట్ టాపిక్.. ఏంటంటే.?
కానీ తాజాగా ఓజి మూవీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కాదు అని “ఒంటరిగా గెలవలేనోడు” అంటూ కొత్త ట్యాగ్ ఇచ్చేశారు వైసిపి నేతలు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైసిపి నేతలు చేసిన పోస్ట్ పై మండిపడుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ పై ఈ కామెంట్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఒంటరిగా అధికారంలోకి రాలేకపోయాడు. టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు అనే ఉద్దేశంతో వైసిపి నేతలు ఇలా ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అంటూ ట్రోల్స్,మీమ్స్ క్రియేట్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.(OG Movie)





