
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో… వైసీపీ సభ్యులు హాజరుకావకపోవడంపై… కూటమి నేతలు తమ స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి రాజీనామా చేసేలా… కూటమి నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. వైసిపి కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా… దూకుడుగా వెళ్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని.. ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు బొత్స సత్యనారాయణ.
Is Botsa Satyanarayana a backstabber for YS Jagan
వైసిపి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న బొత్స సత్యనారాయణ…. మండలిలో జగన్ వాయిస్ వినిపిస్తున్నారు. మొన్నటి వరకు… మంచి దూకుడు మీద ఉన్న బొత్స సత్యనారాయణ… జీఎస్టీ సవరణకు మద్దతు ఇస్తూ తీసుకువచ్చిన తీర్మానం పైన… జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా వ్యవహరించారు. తాజాగా మండలిలో ఈ తీర్మానంపై చర్చ జరగగా… జీఎస్టీ సవరణను వ్యతిరేకిస్తున్నట్లు పరోక్షంగా మాట్లాడారు బొత్స సత్యనారాయణ. జీఎస్టీ సవరణకు మద్దతు తెలుపుతూ తీసుకువచ్చిన తీర్మానంపై మీ స్టాండ్ ఏంటి? అని ఆర్థిక మంత్రి కేశవ్… అసెంబ్లీ వేదికగా నిలదీయగా… అది తమకు ఇష్టం లేదన్నట్లుగా బొత్స వ్యవహరించారు.
Also Read: 13-year-old Afghan boy: విమానం బొక్కల్లో దూరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన కుర్రాడు
జీఎస్టీకి మద్దతు అంటూ జగన్ పోస్ట్
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ లో సంస్కరణలు చేసింది. దీంతో సామాన్య ప్రజలకు చాలా మేలు జరగనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతంగా ఉందని… ఇటీవలే వైయస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ కూడా పెట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ మండలిలో మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి… ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా బొత్స సత్యనారాయణ… వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కూటమినేతలు కూడా బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో… వైయస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచే లాగా బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతోంది.
ఇటీవల షర్మిలతో సీక్రెట్ గా బొత్స సత్యనారాయణ మీటింగ్
ఇటీవల కాలంలోనే వైయస్ షర్మిల తో బొత్స సత్యనారాయణ సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి కి తెలియకుండా… రహస్యంగా షర్మిలను కలిశారట. త్వరలోనే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి.. షర్మిల వైపు బొత్స సత్యనారాయణ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఈ సీక్రెట్ మీటింగ్ తర్వాత.. కథనాలు బయటకు వస్తున్నాయి. ఇలా అధికారపక్షం నుంచి అలాగే సొంత పార్టీ నేతల నుంచి జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళితేనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. లేకపోతే మరింత ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Ambati Rambabu: OG సినిమా బంపర్ హిట్.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు !





