Telangana Congress: మోడీ చచ్చిపోతే రాముడు పోతాడా?..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌నం ?

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు అటు మంత్రులు తమ తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని జనాలలో కలిసిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Telangana Congress Nizamabad Rural MLA Bhupathi Reddy controversial comments modi ramudu

హిందుత్వాన్ని దెబ్బ కొట్టే విధంగా ఆయన మాట్లాడడం వైరల్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీని రాముడితో పోల్చడంపై ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వల్లే రాముడు వచ్చాడని బిజెపి నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. మరి ప్రధాని నరేంద్ర మోడీ చనిపోతే రాముడు కూడా పోతాడా? అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే 75 సంవత్సరాలు దగ్గరపడింది. ఆయన చనిపోయే వయసుకు వచ్చారు… మరో 5 ఏళ్లలో చనిపోయే ప్రమాదం కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Janasena MLA: జర్నలిస్టులకు వార్నింగ్…వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా !

మరి అలాంటప్పుడు రాముడు కూడా చనిపోతాడా ? అన్న యాంగిల్ లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. దీంతో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒళ్ళు బలిసిందని మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చావును కోరుకోవడమే కాకుండా… రాముడిని అవమానించారని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే పై బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే హిందువులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Telangana local body poll: స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల… తేదీలు ఇవే

Share your love