KCR: రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ.. గులాబీ పార్టీలోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

KCR: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలు నెలకొన్నాయి. ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్… అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసినట్లు ప్రజలు కూడా బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. అడు యూరియా సమస్య కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గండంగా మారింది. KCR

Five Congress MLAs join the Pink Party KCR

స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం… గెలుస్తామో లేదు అనే టెన్షన్లో కూడా ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయిన కెసిఆర్ తో తాము నడుస్తామని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తెలిపారట. KCR

Also Read: Sprouts: మొలకలను ఏ సమయంలో తినాలి…అతిగా తింటే ప్ర‌మాదామా…ఇవి తెలుసుకోండి?

ఇందులో ఉత్తర తెలంగాణకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఇద్దరి ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం అందుతోంది. అయితే ఆ ఐదు మంది ఎమ్మెల్యేలను తాను చేర్చుకోనని కేసీఆర్ తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకూడదని కేసిఆర్ భావిస్తున్నారట. గులాబీ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రావాలని స్పష్టం చేశారట. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. KCR

Also Read: Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 ల‌క్ష‌ల కారుతోనే

Share your love