
Telangana: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉభయ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్ అంశం తెరపైకి వచ్చింది. నిన్నటి నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఇటు గులాబీ సోషల్ మీడియా కూడా దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నట్లు రకరకాల పోస్టులు పెట్టింది. ఈ దెబ్బకు స్వయంగా దానం నాగేందర్ దిగివచ్చారు. Telangana
Another by-election in Telangana along with Jubilee Hills
అరే నేను రాజీనామా చేయట్లేదు, అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. తాను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతానని తేల్చి చెప్పారు. రాజీనామా చేసే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు దానం నాగేందర్. అయితే దానం నాగేందర్ రాజీనామా చేసిన లేదా చేయకుండా ఖచ్చితంగా కోర్టు అతనిపై అనర్హత వేటు వేస్తుందని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. Telangana
Also Read: Banana Peel: ఆరటి పండు తిని దాని తొక్కను పడేస్తున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి?
అదే జరిగితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా రావడం గ్యారెంటీ అంటున్నారు. గత చరిత్ర చూస్తే పార్టీలు మారిన వారిపై కోర్టులు చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి వచ్చిన పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా వేటుపడే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. Telangana
Also Read: Danish Kaneria: ఇండియాకు వచ్చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్.. నా మాతృభూమి అంటూ పోస్ట్ ?





