Bahubali: సినీ ఇండస్ట్రీలోనే బాహుబలి పెద్ద డిజాస్టర్ .. రాజమౌళి కన్నీళ్లు.!

Bahubali is the biggest disaster in the film industry

Bahubali: రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 ఈ రెండు సినిమాలు దేశవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో నిరూపించాయి. బాహుబలి పార్ట్ వన్ తో రాజమౌళి డైరెక్షన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. అయితే అలాంటి రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి పార్ట్ వన్ డిజాస్టర్ అని తెలిసి రాజమౌళి కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే అంత పెద్ద హిట్ అయిన సినిమాని డిజాస్టర్ అనడం ఏంటి అని మీ అందరికి డౌట్ రావచ్చు.

Bahubali is the biggest disaster in the film industry

మరి బాహుబలి పార్ట్ వన్ డిజాస్టర్ వెనుక ఉన్న స్టొరీ ఏంటి.. రాజమౌళి ఎందుకు బాధపడ్డారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ మూవీ 2015 విడుదలవ్వగా,బాహుబలి ది కన్ క్లూజన్ 2017 లో విడుదలైంది.అయితే బాహుబలి ది బిగినింగ్ విడుదలైన సమయంలో ఫస్ట్ డే తో నెగిటివ్ టాక్ వచ్చిందట.ఈ నెగిటివ్ టాక్ రావడంతో రాజమౌళి చాలా నిరాశ పడ్డారట. (Bahubali)

Also Read: Director: సొమ్ము ఒకరిది సోకు ఒకరిది.. ఆ మెగా హీరో సెల్ఫ్ డబ్బా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్.!

ముఖ్యంగా బాహుబలి సినిమా ఫిలిం ఇండస్ట్రీలోనే అతిపెద్ద ఫ్లాప్ అంటూ చాలామంది మాట్లాడడంతో ఆ మాటలన్నీ విని రాజమౌళి చాలా బాధపడ్డారట. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించారు. అంతే కాదు రాజమౌళిని నమ్మి బాహుబలి మూవీకి నిర్మాతలు భారీగా డబ్బు ఖర్చుపెట్టారు. మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరి శ్రమ వృధా నేనా అని బాధపడ్డారట.

Bahubali is the biggest disaster in the film industry

అంతేకాదు నిర్మాతలు సినిమా కోసం ఎంతో ఖర్చు చేశారు. అదంతా వేస్ట్ అయిపోయిందా అని తెగ బాధపడిపోయారట.కానీ నెక్స్ట్ డే టాక్ మొత్తం మారిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కానీ మొదటి రోజు వచ్చిన టాక్ విని రాజమౌళి నిరాశలో కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇక ఈ విషయాన్ని రాజమౌళి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.ఇక బాహుబలి ఫస్ట్ సెకండ్ పార్ట్ లు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రీ రిలీజ్ కాబోతోంది.(Bahubali)

Share your love