Allu Arjun: ఆ విషయంలో ప్రభాస్ ని దాటేసిన అల్లు అర్జున్.. ఇది కదా పుష్ప గాడి రేంజ్ అంటే.!

Allu Arjun surpassed Prabhas in that regard

Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో భారీ అంచనాలు పెంచే వార్తలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అయితే తాజాగా ఓ విషయంలో ప్రభాస్ ని బీట్ చేసిన అల్లు అర్జున్ అంటూ ఒక షాకింగ్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ అల్లు అర్జున్ ప్రభాస్ ని దాటేసిన ఆ విషయం ఏంటంటే..రెమ్యూనరేషన్ లో.. అల్లు అర్జున్ పుష్ప,పుష్ప టు వంటి రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంతో పాటు రెమ్యూనరేషన్ ని కూడా భారీగా పెంచేశారు.

Allu Arjun surpassed Prabhas in that regard

ఇక గత ఏడాది వచ్చిన పుష్ప టు మూవీకి అల్లు అర్జున్ రికార్డ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా పుష్ప టు కి 300 కోట్ల రెమ్యూనరేషన్ అల్లు అర్జున్ తీసుకున్నట్టు ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఈ లెక్కన చూసుకుంటే అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ విషయంలో ప్రభాస్ ని దాటేసినట్టే. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటి వరకు చేసే సినిమాలకు 150 కోట్లకు మించి తీసుకోలేదు.(Allu Arjun)

Also Read: Bahubali: సినీ ఇండస్ట్రీలోనే బాహుబలి పెద్ద డిజాస్టర్ .. రాజమౌళి కన్నీళ్లు.!

కానీ ప్రభాస్ కంటే డబల్ రేంజ్ లో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీకి కూడా అల్లు అర్జున్ రికార్డు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.ఈ సినిమాకి బన్నీ ఏకంగా 175 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ డైరెక్టర్ అట్లీ కూడా జవాన్ మూవీ హిట్టుతో మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేశారట. ఇక ఈ రెమ్యూనరేషన్ కారణంగానే సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైనట్టు తెలుస్తోంది.

Allu Arjun surpassed Prabhas in that regard

అలా దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ లో దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ గ్రాఫిక్స్ కోసమే కేటాయించారు అంటే సినిమాలో గ్రాఫిక్స్ ఏ లెవెల్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలా ఇండియన్ సినిమాల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్థానాల్లో ప్రభాస్ ని దాటేసి అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశారంటూ ఆయన ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.(Allu Arjun)

Share your love