
Jubilee Hills bypoll: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటీవల కాలంలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 11వ తేదీన అంటే సరిగ్గా నెల రోజులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. Jubilee Hills bypoll
Jubilee Hills bypoll Modi calls KCR
నవంబర్ 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే గులాబీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఖరారయ్యారు. గులాబీ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు ఖరారు చేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బిజెపి పార్టీకి సంబంధించిన అభ్యర్థి పేరు ఇంకా రాలేదు. ఇలాంటి నేపథ్యంలో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. Jubilee Hills bypoll
Also Read: Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నారా… అయితే జాగ్రత్త, ఇవి కచ్చితంగా తెలుసుకోండి…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా రేవంత్ రెడ్డి పార్టీని ఓడించాలని కెసిఆర్ కు దిశా నిర్దేశం చేశారట ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని జనాలు మొత్తుకుంటున్నారని మోడీ గుర్తు చేశారట. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అధికార పార్టీని ఓడించాలని కేసీఆర్ కు సూచనలు చేశారంట. దానికోసం పనిచేయాలని వెల్లడించారట. ఈ పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీకి మోడీ పార్టీ సపోర్ట్ చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ డమ్మీ అభ్యర్థిని బిజెపి పెట్టి…బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయనుందని కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపణలు చేసింది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కు మోడీ ఫోన్ చేయడం హాట్ టాపిక్ అయింది. మరి జూబ్లిహిల్స్ ఎన్నికపై కేసీఆర్, మోడీ ఎలా ముందుకు వెళతారో చూడాలి. Jubilee Hills bypoll
Also Read: Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నారా… అయితే జాగ్రత్త, ఇవి కచ్చితంగా తెలుసుకోండి…





