
Venu Swamy: గత కొద్ది రోజులుగా వేణు స్వామి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఎవరి జాతకాలతోనూ నెట్టింట్లో వైరల్ అవ్వడం లేదు. కానీ తాజాగా మరోసారి సోషల్ మీడియాలోకి కం బ్యాక్ అయ్యారు.మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ మరోసారి హాట్ టాపిక్ గా మారారు.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్లిన దివ్వెల మాధురి,పికిల్స్ పాప రమ్య, రీతూ చౌదరి గురించి వేణు స్వామి మాట్లాడుతూ.. బిగ్ బాస్ చూస్తున్న చాలామంది మాధురి, రమ్య, రీతూ చౌదరి లాంటి దరిద్రాలను మా బెడ్ రూమ్ ల వరకు తీసుకువచ్చారు చాలా చెండాలంగా ఉంది దాన్ని బ్యాన్ చేయాలి అంటూ అరుస్తున్నారు. కానీ మాధురి, రమ్య,రీతులను వైరల్ చేసింది ఎవరు? వారిని బిగ్ బాస్ దాకా వచ్చేలా చేసింది ఎవరు.. మీరు కాదా..సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరో తెలియదు.
Venu Swamy sensational comments on Bigg Boss
కానీ వారిని హైలెట్ చేసింది మీరే. పచ్చళ్ళు అమ్ముకుంటున్న రమ్యని ఓ ఆడియో మెసేజ్ ద్వారా వైరల్ చేసింది మీరే.దువ్వాడ శ్రీనివాస్ వల్ల మాధురిని ఫేమస్ చేసింది మీరే. రీతు చౌదరి పేరు మీద వందల కోట్లు ఉన్నాయని ఆమె పేరుని బయటికి లాగింది మీరే.ఇలా ఈ ముగ్గురిని మీరే ఫేమస్ చేశారు. ఫేమస్ చేశాక బిగ్ బాస్ వాళ్ళు ఊరుకుంటారా.. వారిని తీసుకువచ్చి టిఆర్పి రేటింగ్ పెంచుకోవాలని చూస్తారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది తమకు నచ్చని వారిని చెడుగా చూపించి చెడు ముద్ర వేయాలి.బట్ట కాల్చి మీద వేయాలి అని అనుకుంటున్నారు.కానీ ఎవరినైతే చెడుగా ముద్రించాలి అనుకుంటారో రివర్స్ గా వాళ్లే ఫేమస్ అవుతున్నారు. సీఎంలను,రాజకీయ నాయకులను తిట్టేవారు ఫేమస్ అవుతున్నారు. (Venu Swamy)
Also Read: Samantha: విడాకుల సమయంలో కొందరు సంబరాలు చేసుకున్నారు.. సమంత ఎమోషనల్ వ్యాఖ్యలు!!
మహాత్మా గాంధీని బండ బూతులు తిట్టినా కూడా మనోభావాలు దెబ్బ తినడం లేదు కానీ జ్యోతిష్యాలు, జాతకాలు చెబితే మాత్రం వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇక ఫేమస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిలో ఇరుక్కోవడానికి రెడీగా ఉండండి.. ఇక ఇలాంటివారిని బిగ్ బాస్ టీం కచ్చితంగా ఆదరిస్తుంది. ఇక ప్రతిసారి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే సమయానికి కంటెస్టెంట్లను అందించేది ఒకరకంగా సోషల్ మీడియానే అని చెప్పుకోవచ్చు.సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని కంటెస్టెంట్లుగా హౌస్ లోకి తీసుకువస్తున్నారు. ఇక మెయిన్ మీడియా సోషల్ మీడియా లేకపోతే బిగ్ బాస్ కి అసలు కంటెస్టెంట్లే దొరకడం లేదు.అలా ప్రతి సంవత్సరం బిగ్ బాస్ లో ఇద్దరు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ముగ్గురు కాంట్రవర్సీలు కచ్చితంగా వస్తున్నారు.

ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరైనా వ్యూస్ కోసం టార్గెట్ చేయవచ్చు. కానీ అలా టార్గెట్ చేస్తే మీ జాతకం భవిష్యత్తులో మారబోతుందని అర్థం చేసుకోండి. ఇలాంటి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ కోసం హౌస్ లో తీసుకొచ్చి పెడుతుంది. ఇక ఎవరైనా బట్ట కాల్చి మీదేస్తే మీ జాతకం మారుతుందని అర్థం చేసుకోండి. ఏమో 2026 లో మీరే బిగ్ బాస్ లోకి వెళ్లవచ్చు. స్టార్ హీరోలు కావచ్చు.ఎలాంటి పరిస్థితుల్లో కూడా ట్రోలింగ్ కి భయపడకండి అంటూ సంచలన కామెంట్స్ చేశారు వేణు స్వామి. ఇక వేణు స్వామి కామెంట్లు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది వేణు స్వామి చెప్పిందే నిజం.సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారే బిగ్ బాస్ లోకి వస్తున్నారు అంటూ ఆయన మాటల్ని సపోర్ట్ చేస్తున్నారు.(Venu Swamy)





Chiranjeevi: చిరంజీవికి మనవడి కోరిక తీరదు.. మళ్లీ మొదలెట్టిన వేణు స్వామి జాతకాలు.!