
Kolikapudi Srinivas Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలికపూడి శ్రీనివాస రావు ఎపిసోడ్ కొరకరానికి కొయ్యగా తెలుగుదేశం పార్టీకి తయారైంది. కాక కాక ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాస రావు ఎక్కడా తగ్గడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినా, పార్టీ పరువును మాత్రం బజారుకు ఈడుస్తున్నారు కొలికపూడి శ్రీనివాస రావు. గెలిచిన రెండేళ్లలోనే అనేక రకాల ఆరోపణలను ఎదుర్కొన్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొలికపూడి శ్రీనివాస రావు మారిపోయారు. Kolikapudi Srinivas Rao
Kolikapudi Srinivas Rao into ycp party
అయితే తాజాగా టిడిపి టికెట్ కోసం ఐదు కోట్లు వసూలు చేశారని విజయవాడ ఎంపీ చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు. ఇక తిరువూరు కూడా విజయవాడ పార్లమెంటు పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో… తనకు తెలుగుదేశం పార్టీ టికెట్ రావాలంటే రూ.5 కోట్లు ఇవ్వాల్సిందేనని కేశినేని శివనాథ్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు చేశారు కొలికపూడి శ్రీనివాస రావు. అంతేకాదు ఆయనకు ఇచ్చిన ఐదు కోట్ల రూపాయల బ్యాంకు స్టేట్మెంట్లు కూడా బయటపెట్టారు కొలికపూడి శ్రీనివాస రావు. Kolikapudi Srinivas Rao
Also Read: TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్ కేసులో ట్విస్ట్..నారాయణరావు ఆత్మహత్య
అయితే దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని కూడా స్పందించారు. ఆ కొలికపూడి శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు ఖండించారు. వైసీపీకి నేనెప్పుడూ సపోర్ట్ చేయలేదని… డబ్బులు తీసుకున్నది ఆరోపణలు మాత్రమే అని కౌంటర్ ఇచ్చారు. రాజకీయంలో అనుభవం లేక కొలికపూడి శ్రీనివాస రావు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 12 నెలల వరకు తనను దేవుడు అని పిలిచినా కొలికపూడి శ్రీనివాస రావు ఇప్పుడు దెయ్యం అంటూ పరువు తీస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఆయన వెనుక వైసిపి ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి కొలికపూడి శ్రీనివాస రావు వెళ్తారని ఈ ప్రచారం జోరు అందుకుంది. Kolikapudi Srinivas Rao
Also Read: Curd: రాత్రిపూట పెరుగుతో తింటున్నారా..అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి ?





