
Kurnool Bus Fire Accident: దేశవ్యాప్తంగా కర్నూలు బస్సు ప్రమాదం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దీపావళి హాలిడేస్ ముగించుకొని బెంగళూరు వెళుతున్న కావేరీ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు కారణం ఎవరు అనేది ఇంకా తేలలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.Kurnool Bus Fire Accident
Kurnool Bus Fire Accident The ill-fated bike had pillion rider
19 మంది ప్రాణాలు తీసింది ఒక బైకర్ యాక్సిడెంట్ అని వీడియోలు, ఫోటోలు నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన అర్ధరాత్రి 2 గంటల సమయంలో పల్సర్ బైక్‌పై తన స్నేహితుడు ఎర్రిస్వామి అలియాస్ నానిని తుగ్గలి గ్రామంలో వదిలేందుకు లక్ష్మీపురం నుండి బయలుదేరాడు శివశంకర్. ఇక మార్గమధ్యంలో కియా షోరూమ్ వద్ద ఉన్న HP పెట్రోల్ బంక్‌లో రూ.300 పెట్రోల్ నింపుకున్నారు ఈ ఇద్దరు కుర్రాళ్లు. Kurnool Bus Fire Accident
Also Read: Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో సంచలనం..234 కొత్త ఫోన్లే కొంపముంచాయా ?
కొద్ది దూరం వెళ్ళగానే స్కిడ్ అయి డివైడర్‌ను ఢీ కొట్టింది అతని బైక్. ఇక రోడ్డు మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడట శివశంకర్.. రోడ్డుకు దూరంగా పడి స్వల్ప గాయాలతో వెనక కూర్చున్న నాని బయటపడ్డాడని అంటున్నారు. ఇక రోడ్డు మధ్యలో ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగాడు నాని. అంతలోనే రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్‌ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లింది బస్సు. బస్సు కింద మంటలు రావడంతో భయపడి తన స్వగ్రామం తుగ్గలికి వెళ్ళిపోయాడు నాని. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నానిని గుర్తించి, పలు కోణాల్లో విచారించి ప్రమాదం జరిగిన తీరును వివరించారు పోలీసులు. Kurnool Bus Fire Accident
Also Read: Green chilies: పచ్చిమిరపకాయలు తింటున్నారా.. అయితే 100 రోగాలకు చెక్ ?

