
KCR: తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది కాంగ్రెస్ పార్టీలోకి జంపు కాగా.. ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి అగ్ని పరీక్ష గా మారింది. KCR
KCR Big shock for KCR BRS income drops by 97 percent
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గట్టిగా తలుచుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీకి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయపరంగా తీవ్రంగా గులాబీ పార్టీ నష్టపోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ పార్టీకి వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయినట్లు స్పష్టం చేస్తున్నాయి నివేదికలు. KCR
Also Read: Shreyas Iyer: క్రిటికల్ గా శ్రేయాస్ అయ్యర్ కండిషన్..BCCI సంచలన నిర్ణయం
2024 నుంచి 2025 సంవత్సరాల మధ్య కేవలం 15.9 కోట్లు మాత్రమే విరాళాలు గులాబీ పార్టీకి వచ్చాయి. ఈసీకి గులాబీ పార్టీ తాజాగా సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ లో ఈ విషయం తేలిపోయింది. ప్రోగ్రెసివ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ కింద పది కోట్లు రాగా ప్రిడేంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి ఐదు కోట్లు మాత్రమే లభించాయి. ఇక 2023 నుంచి 2024 ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా కారు పార్టీకి 580.52 కోట్లు దక్కాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 97.4% ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అయితే గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆదాయం భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. KCR
Also Read: Nara Dishti: రోడ్డుపై పడేసిన నిమ్మకాయలను తొక్కితే ఏం జరుగుతుందో తెలుసా…?





