Telangana: రేవంత్ స‌ర్కార్ లో మ‌రో సంచ‌ల‌నం..బాంబ్ పేల్చిన మంత్రి ?

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వంలో మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. నువ్వు ఈ శాఖలో పని చేయలేవు..వేరే శాఖ చూసుకో అంటూ కొత్తగా తన శాఖకు బదిలీ అయిన ఐఏఎస్ అధికారిని వెనక్కు పంపించార‌ట‌ సంబంధిత శాఖ మంత్రి. తెలంగాణలో అక్టోబర్ 31వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రధాన కార్యదర్శి. Telangana

Telangana key new about revanth reddy cabinet

ఈ నేపథ్యంలో తనను బదిలీ చేసిన శాఖలో చేరే ముందు, సంబంధిత మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసార‌ట‌ సదరు ఐఏఎస్ అధికారి. నువ్వు ఈ శాఖలో పని చేయలేవు..వేరే శాఖ చూసుకో, నేను సీఎంకు ఫోన్ చేసి చెప్పాను అని ఐఏఎస్ అధికారికి తేల్చి చెప్పార‌ట‌ మంత్రి. దీంతో చేసేదేమీలేక, నిరాశతో వెనుదిరిగార‌ట‌ ఐఏఎస్ అధికారి. మరోవైపు ప్రస్తుతం అదే శాఖలో పని చేస్తున్న అధికారి, ఆరు నెలలుగా ఆ శాఖ వదిలి వెళ్లేందుకు ప్రయత్నించగా, అందుకు నిరాకరిస్తున్నార‌ట తెలంగాణ రాష్ట్ర మంత్రి మంత్రి. Telangana

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవ‌డ‌మే.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం ?

కొత్త అధికారిని కూడా మంత్రి అడ్డుకున్నాడని తెలిసి, నిరాశ చెందారట‌ సదరు శాఖ అధికారి. ప్రభుత్వంలో భాగమైన మంత్రి, ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులను అడ్డుకోవడంతో రాజకీయ వర్గాల్లో మొదలైన వాడివేడి చర్చలు జ‌రుగుతున్నాయ‌ట‌. మంత్రులకు తెలియకుండా వారి శాఖలో అధికారులను బదిలీ చేస్తున్నారా, లేక మంత్రులు కోరుకున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంలేదా ? అనే చ‌ర్చ మొద‌లైంది. దీనికి సంబంధించిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. Telangana

Also Read: Womens World Cup 2025: ఛాంపియ‌న్ గా ఇండియా…భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన బీసీసీఐ..ఎన్ని కోట్లంటే

Share your love