Vijay Deverakonda: “ఊసరవెల్లి” అంటూ బండ్ల గణేష్ నీ ట్రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.!

Vijay Deverakonda fans trolling Bandla Ganesh

Vijay Deverakonda: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏం మాట్లాడిన ముక్కు సూటిగా మాట్లాడుతారు.. ఎవరో ఏదో అంటారని భయపడి ఆయన మాట్లాడకుండా అస్సలు ఉండరు. అలాంటి బండ్ల గణేష్ తాజాగా ఒక సినిమా ఈవెంట్ కు వచ్చి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మాటలను ఒక హీరో అభిమానులు ట్రోల్ చేస్తూ ఏకిపారేస్తున్నారు. మరి ఆయన ఏమన్నారో ఆ వివరాలు చూసేద్దాం.. బండ్ల గణేష్ తాజాగా హీరో కిరణ్ అబ్బవరం నటించినటువంటి కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ కు హాజరయ్యారు..

Vijay Deverakonda fans trolling Bandla Ganesh

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండ్ల గణేష్ వర్సెస్ విజయ్ దేవరకొండ అన్న రేంజ్ లో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి మధ్య వార్ విపరీతంగా సాగుతోంది. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం ఎన్నిసార్లు సక్సెస్ అందుకున్న చాలా సింపుల్ గా ఉంటారని అన్నారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా ఉంటారో కిరణ్ అబ్బవరం కూడా ఆ విధంగానే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగి ఉన్నాడని తెలియజేశారు. (Vijay Deverakonda)

Also Read: Divvela Madhuri: “వాడసలు ఓ అమ్మకి అబ్బకి పుట్టలేదు”.. దివ్వెల మాధురి కామెంట్స్ ఎవరిపై అంటే.?

ఇక కొంతమంది హీరోలు ఉంటారు ఒక్క హిట్టు పడిందో లేదో లూజు ప్యాంట్లు వేసుకొని, వాట్సప్ వాట్స్అప్ అంటూ స్టైల్ గా మాట్లాడతారని సూచించారు. కానీ కిరణ్ అబ్బవరం సక్సెస్ మీద సక్సెస్ అందుకున్న సైలెంట్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారని తెలియజేశారు. ఆయన లూజు ప్యాంట్లు, రాత్రిపూట కూలింగ్ గ్లాసెస్ అని మాట్లాడడంతో అది విజయ్ దేవరకొండ గురించే మాట్లాడాడని ఆయన అభిమానులు కోపానికి వస్తున్నారు.

Vijay Deverakonda fans trolling Bandla Ganesh

మా అభిమాన హీరో గురించి బండ్ల గణేష్ ఈ విధంగా మాట్లాడడం బాగోలేదని సీరియస్ అవుతున్నారు. మా హీరో బరాబర్ లూజ్ ప్యాంట్లు వేస్తారు, ఆయన స్టైల్ ఆయన ఇష్టం..నీకు ఎక్కడ నొచ్చుకుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.. త్వరలో మా హీరో పెద్ద హిట్టు కొడుతున్నాడు.. చూసుకో బండ్ల గణేష్ అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా బండ్ల గణేష్ మరియు విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య తీవ్రమైన మాటలు యుద్ధం నడుస్తోందని చెప్పవచ్చు.(Vijay Deverakonda)

https://twitter.com/VIZAGVDFA/status/1985625319299313821
Share your love