Virat Kohli: కోహ్లీ విడాకులు ఇవ్వ‌నున్న అనుష్క శ‌ర్మ‌?

Virat Kohli: బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అనుష్క శర్మ అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ బ్యూటీకి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అనుష్క శర్మ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. తన కెరీర్ లో ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలనూ తన ఖాతాలో వేసుకుంది. అదే స్థాయిలో అభిమానుల మనసులను కూడా దోచుకుంది. అనుష్క శర్మ సినిమాలతో పాటు యాడ్ షూట్స్ లలో కూడా చురుగ్గా పాల్గొంటారు. పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తారు. ఇక అనుష్క శర్మ ఓ యాడ్ షూట్ సమయంలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీని కలిశారు. వీరిద్దరూ కలిసి మొదట ఓ యాడ్ షూట్ లో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. Virat Kohli

Virat Kohli divorce to anushka sharma

అనంతరం డిసెంబర్ 11, 2017న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అనుష్క శర్మ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తోంది. తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు. విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డేలు, ఐపీఎల్ మ్యాచ్లను మాత్రమే ఆడుతారు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు వారి కుటుంబంతో కలిసి లండన్ లో సెటిల్ అయ్యారు. మ్యాచ్లు ఉన్న సమయంలో కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చి మ్యాచ్ పూర్తయిన తర్వాత తిరిగి లండన్ బయలుదేరుతారు. తాజాగా విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. విరాట్ కోహ్లీకి చాలామంది అభిమానులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరూ కోహ్లీకి స్పెషల్ గా విషెస్ తెలియజేశారు. Virat Kohli

Also Read: Jubilee Hills Bypoll: బీజేపీలో గులాబీ పార్టీ విలీనం.. రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్?

అయితే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మాత్రం కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా చెప్పలేదు. అంతేకాకుండా ఎలాంటి పోస్ట్ షేర్ చేసుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు మొదలయ్యాయనే టాక్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున నడుస్తోంది. వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆ కారణంతోనే అనుష్క శర్మ ఎలాంటి పోస్ట్ షేర్ చేయలేదంటూ ఓ వార్త సంచలనాలు సృష్టిస్తోంది. ఇందులో ఇంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ విషయం బయటకు వచ్చిన అనంతరం కోహ్లీ అనుష్క అంటే పడని వారే ఇలాంటి వార్తలను పుట్టిస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయం పైన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Virat Kohli

Also Read: Jubilee Hills Bypoll: కేసీఆర్ సంచ‌ల‌న ప్రెస్ మీట్‌..ఇక కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా…