iBOMMA: కిక్ కోసమే ఇదే చేశాడా..ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసులో షాకింగ్ నిజాలు ?

Ibomma Ravi Arrest

iBOMMA: కొత్త సినిమాలు రిలీజ్ కాకముందే డౌన్లోడ్ చేసి జనాలకు అందిస్తున్న ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాకు పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు ఇమ్మ‌డి రవిని మూడు రోజుల కిందట అరెస్టు చేశారు. ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం టీవీ పేర్లతో వెబ్సైట్లు క్రియేట్ చేసి కొత్త సినిమాలు అన్నిటిని అందులో డౌన్లోడ్ చేసుకునేలా భారీ డ్యామేజ్ చేశాడు.

iBOMMA ravi arrested

అంతేకాదు ఇటీవల కాలంలో పోలీసులకు సవాలు కూడా చేశాడు. దమ్ముంటే నన్ను పట్టుకోండి చూద్దాం అంటూ రెచ్చిపోయాడు. తన వద్ద కోట్ల మంది డేటా ఉందని, ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలోనే చాలా చాకచక్యంగా ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే, త‌న భార్య‌కు విడాకులు ఇచ్చే, క్ర‌మంలో ఇమ్మ‌డి ర‌విని అరెస్ట్ చేశార‌ట‌. అయితే, ఈ విష‌యంలో కీల‌క పరిణామం చోటు చేసుకుంది. iBOMMA ravi arrested

Also Read: Kavitha: రేవంత్ రెడ్డి -కల్వకుంట్ల కవిత కాంబినేషన్ లో బడా కంపెనీ ?

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి భార్యతో విడాకులు తీసుకుంటూ దొరికిపోయాడు అనేది అవాస్తవం అంటున్నారు పోలీసులు. ఐదేళ్ల క్రితమే విడాకులు తీసుకున్న రవి… ఐ బొమ్మతో స్కాం చేశాడ‌ట‌. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుండి డబ్బులు తీసుకున్నాడ‌ట‌ రవి. ఆ ఐపీ అడ్రస్‌పై దర్యాప్తు చేసి ముసాపేటలోని విస్టా అపార్ట్‌మెంట్స్ అని గుర్తించి, నిఘా పెట్ట‌రు పోలీసులు. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుండి ఇమ్మడి రవి తిరిగి రాగానే, పక్కా సమాచారంతో పట్టుకున్నారు పోలీసులు. ఇదంతా కిక్ కోస‌మే చేశాడ‌ని పోలీసులు అంటున్నారు. iBOMMA ravi arrested

Also Read: Vangaveeti Ranga: వంగవీటి రంగా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu