IBomma Ravi: ఐ-బొమ్మలో బిగ్ ట్విస్ట్‌…తెర‌పైకి సీపీఐ నారాయణ పేరు ?

IBomma Ravi: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కొత్త సినిమాలను పైరసీ చేసి, కోట్లు సంపాదిస్తున్నాడు ఐ బొమ్మ రవి. సినిమా రిలీజ్ కంటే వారం రోజుల ముందే, మూవీని చూసి ఎంజాయ్ చేసేవాడు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన రోజు అంతర్జాతీయ వెబ్సైట్లకు అమ్మేసేవాడు. అలా బడా సినిమాలన్నిటిని అమ్మేసి క్యాష్ చేసుకున్నాడు ఐ బొమ్మ రవి. IBomma Ravi

CPI Narayana supports iBomma Ravi

అంతేకాదు తనను ఎవరు పట్టుకోలేరని, దమ్ముంటే పట్టుకోండి అంటూ తెలంగాణ పోలీసులకు సవాలు కూడా విసిరాడు ఐ బొమ్మ రవి. అయితే అలాంటి ఐ బొమ్మ రవిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ ఎపిసోడ్ పై తాజాగా సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐ బొమ్మ వెబ్సైట్ లో తాను కూడా ఫ్రీగా సినిమాలు చూసినట్లు స్పష్టం చేశారు. IBomma Ravi

Also Read: Chandrababu: చంద్ర‌బాబు సంచ‌ల‌నం..జోనల్‌ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్..ఇక‌పై త్రిముఖ వ్యూహం ?

ఆరేడు వందలు టికెట్ ధరలు ఉంటే, ఎవడు థియేటర్ కు వెళ్లి సినిమాలు చూస్తాడు, అంటూ ఫైర్ అయ్యారు. అందుకే తాను కూడా ఐ బొమ్మలో ఫ్రీగా సినిమా చూసినట్లు వెల్లడించారు. సామాన్యులకు దేవుడిలా ఐ బొమ్మ మారిందని పేర్కొన్నారు. రవి లాంటి వాళ్లు ఇలా అవ్వడానికి మన వ్యవస్థలో ఉన్న లోపాలే కారణమంటూ ఫైర్ అయ్యారు. ఇకపైన హీరోలు రెమ్యూనరేషన్లు తగ్గించుకొని, జనాలకు అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలు ఫిక్స్ చేయాలని కోరారు నారాయణ. IBomma Ravi

Also Read: Shreyas Iyer: టాలీవుడ్ హీరోయిన్ తో శ్రేయాస్ అయ్య‌ర్ ఎ**ఫైర్ ?

Share your love