

Kodangal bandh: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడి నియోజకవర్గం ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు కొడంగల్ బందుకు పిలుపునిచ్చారు. Kodangal bandh
Ahead of CM revanth reddy visit, Kodangal observes Kodangal bandh to protest against shifting of colleges to Lagacherla
కొడంగల్ మండలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వెళ్లకుండా నిరసన తెలియజేయాలని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. కొడంగల్ మండల కేంద్రం నుంచి మెడికల్ కళాశాల వెటర్నరీ నర్సింగ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాలలను దుద్యాల మండలానికి తరలించడంపై కొడంగల్ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Kodangal bandh
Also Read: I-Bomma Ravi Father: కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు.. ఐ-బొమ్మ రవి తండ్రి…
వెంటనే కొడంగల్ మండలానికి వాటిని తీసుకురావాలని నిరసన తెలుపుతూ బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగానే వ్యాపార సముదాయాలు బంద్ పాటించి నిరసన తెలుపుతున్నాయి. ఇక అటు ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. Kodangal bandh
Also Read: Rohit-Kohli: డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ..టికెట్ ధర ఎంతంటే ?
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





