iBOMMA Ravi: “మామ హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం”..ర‌వి ఇలా దొరికిపోయాడా ?

iBOMMA Ravi: iBOMMA రవి కేసులో కీలక ప‌రిణామం చోటు చేసుకుంది. “మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం అంటూ మిత్రుడికి మెసేజ్ పంపడంతో, దొరికిపోయాడు iBOMMA రవి. హైదరాబాద్ – ఇటీవల పైరసీ నేరం పేరిట అరెస్టయిన ఇమ్మ‌డి రవిని దర్యాప్తు చేస్తున్నాడు పోలీసులు. ఐ బొమ్మ రవి ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ పేరిట డొమైన్లు కొనుగోలు చేసినట్లు, ఆ డొమైన్లకు అనుగుణంగా ఉన్న ఫోన్ నంబర్‌పై నిఘా పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. iBOMMA Ravi

iBOMMA Ravi case update police key informantion

విదేశాల్లో ఉంటూ, అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి, ఒక స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకుంటాడని గుర్తించి, రవి హైదరాబాద్ వస్తే చెప్పాలని అతనికి ఆదేశాలు ఇచ్చారు పోలీసులు. ఇటీవల ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ వచ్చి, “మామా హైదరాబాద్ వచ్చా..కలుద్దాం” అంటూ స్నేహితుడికి మెసేజ్ పంపాడు రవి. iBOMMA Ravi

Also Read: Rohit-Kohli: డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ..టికెట్ ధ‌ర ఎంతంటే ?

దీంతో రవి హైదరాబాద్ వచ్చినట్లు నిర్ధారించి, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, మొద‌ట ర‌వి భార్య విడాకులు నేప‌థ్యంలో అత‌న్ని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు వార్త‌లు వచ్చాయి. ఇక ఇప్పుడు “మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం అంటూ మిత్రుడికి మెసేజ్ పంపడంతో ర‌వి దొరికిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. మ‌రి దీనిపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా, ప‌ది రోజుల కింద‌టే ఐ బొమ్మ అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. iBOMMA Ravi

Also Read: I-Bomma Ravi Father: కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు.. ఐ-బొమ్మ రవి తండ్రి…

Share your love