Mega Heroes: ఆకాశంలో నుండి ఊడి పడ్డారా.. మెగా హీరోల పరువు తీసిన ఐ బొమ్మ రవి తండ్రి.!

I Bomma Ravi father who insulted Mega Heroes
I Bomma Ravi father who insulted Mega Heroes

Mega Heroes: ఐ బొమ్మ నిర్వాకుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పర్సనల్ విషయాలు తప్పితే సినిమాకి సంబంధించిన ఏ విషయాలు, పైరసీ విషయాలు ఏ ఒక్కటి కూడా బయట పెట్టలేదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వంటివి అడిగితే తెలియదు,మర్చిపోయా అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఐ బొమ్మ రవిని టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ వాడిని ఎన్కౌంటర్ చేయాలి అని ఇచ్చిన స్టేట్మెంట్ కి ఐ బొమ్మ రవి ఫాదర్ అప్పారావు మా వాడినెందుకు ఎన్కౌంటర్ చేయాలి.వాడు ఎన్కౌంటర్ చేసే అంత తప్పు ఏమీ చేయలేదు.

I Bomma Ravi father who insulted Mega Heroes

చేస్తే గీస్తే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలి. కోట్లకు కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసి టికెట్ రేట్లు పెంచి సామాన్య ప్రజలను వినోదానికి దూరం చేస్తున్నారు. అలా అని నా కొడుకు చేసింది తప్పు కాదు అని నేను అనడం లేదు.వాడు చేసింది తప్పే.. వాడు చేసిన తప్పుకు చట్టం ఏ శిక్ష వేసినా వాడు భరించాల్సిందే. కానీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రం కోట్లకు కోట్ల బడ్జెట్లు పెట్టి రెమ్యూనరేషన్లు ఇచ్చి సినిమాలు తీసి సినిమా టికెట్లు భారీగా పెంచుతున్నారు. (Mega Heroes)

Also Read: iBOMMA Ravi: “మామ హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం”..ర‌వి ఇలా దొరికిపోయాడా ?

సినిమా ఇండస్ట్రీలోకి కొత్తవారు వస్తేనే ఇండస్ట్రీ ఎదుగుతుంది.అలాకాకుండా కొంతమంది చేతుల్లో మాత్రమే ఇండస్ట్రీ ఉంటే ఇక అంతే.. మెగా హీరోలు ఏమైనా ఆకాశంలో నుండి ఊడిపడ్డారా.. ఎందుకు వారికి అన్ని కోట్లు ఇచ్చి సినిమాలు తీయడం.. ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య ది గ్రేట్ నటుడు. ఆయన కూతుర్ని చిరంజీవికి ఇవ్వడంతో చిరంజీవికి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చారు. మెగా హీరోలు ఏమైనా ఆకాశంలో నుండి ఊడిపడ్డరా..

I Bomma Ravi father who insulted Mega Heroes

సినిమా ఇండస్ట్రీలో కొనసాగడానికి ఎంతోమంది నటనా టాలెంట్ ఉన్నవారు బయట ఉన్నారు. వారి టాలెంట్ ని గుర్తించే సినిమాల్లో అవకాశాలు ఇస్తే తక్కుబడ్జెట్ తో సినిమాలు అయిపోతాయి. టికెట్ రేట్ పెంచాల్సిన అవసరం కూడా ఉండదు. ఎంతసేపు ఇండస్ట్రీలో ఉన్న హీరోలకే అవకాశాలు ఇచ్చి కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్లు ఇచ్చి సినిమా టికెట్ రేట్లు పెంచడం ఎందుకు అంటూ ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రవి తండ్రి మాట్లాడే మాటలపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఆయన మాట్లాడింది నిజమే. ఇండస్ట్రీలో ఉన్న స్టార్లను పెట్టి సినిమాలు తీసి వారికి కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చే బదులు కొత్తవారిని ఎంకరేజ్ చేయొచ్చుగా అంటున్నారు.(Mega Heroes)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu