Saikiran Yadav: ఖైరతాబాద్ బరిలో తలసాని శ్రీనివాస్ కొడుకు..నవీన్ యాదవ్ స‌పోర్ట్‌?

Saikiran Yadav: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఖైరతాబాద్ తోపాటు స్టేషన్ ఘనపూర్ రెండు నియోజకవర్గాల ఉపఎన్నిక కచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ గా కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ ఇద్దరూ కూడా పార్టీ మారినట్లు రుజువులు ఉన్నాయి. దీంతో కచ్చితంగా ఈ ఇద్దరి పై వేటు పడే ఛాన్స్ ఉంది. Saikiran Yadav

Saikiran Yadav may contest in Khairatabad by election

అదే జరిగితే ఏప్రిల్ లోపు రెండు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలో దానం నాగేందర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పిజెఆర్ కూతురు విజయారెడ్డి బరిలో ఉండే ఛాన్స్ ఉందట. ఇటు గులాబీ పార్టీ తరఫున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ పోటీ చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Saikiran Yadav

Also Read: Smriti Mandhana: ప్రియురాలితో లేచిపోయిన పలాష్.. స్మృతి వివాహం ఆగిపోవడం వెనుక షాకింగ్ విషయం..

అటు బిజెపి పార్టీ తరఫున చింతా ప్రభాకర్ పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే విజయారెడ్డి గులాబీ పార్టీలోకి వస్తే ఆమెకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారట. పీజేఆర్ కూతురు విజయారెడ్డి గులాబీ పార్టీలోకి రాకపోతే మాత్రం తలసాని శ్రీనివాస్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ కు ఛాన్స్ రానుందాట. తలసాని కుమారుడు బరిలో ఉంటే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ గులాబీ పార్టీకి సపోర్ట్ చేసే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. యాదవులందరూ కలిసి సాయికిరణ్ యాదవ్ కు ఓటు వేసేలా నవీన్ యాదవ్ కూడా పావులు కదుపనున్నారట. Saikiran Yadav

Also Read: KCR: కేసీఆర్ కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఆ మాతం ప‌డిపోయిన నిధులు ?

Share your love