
Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించి జెసిబిలతో దాడి చేశాడట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుత్రరత్నం. గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు రాఘవ కంపెనీ పై కేసు నమోదు అయినట్లు చెబుతున్నారు. 4 రోజులుగా వార్త బైటికి పొక్కకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుపడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Ponguleti Srinivasa Reddy
police case on Ponguleti Srinivasa Reddy son
గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టి నాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించి 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూల్చివేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటు అడ్డుకున్న స్థలం యజమానిపై దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. దీంతో 7 సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారట. పల్లవి షా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. Ponguleti Srinivasa Reddy
Also Read: Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ పరువు తీసిన కవిత..ఆయన ఎప్పుడూ సమైక్యావాదినే
అక్కడ ఉన్న గోషాలను సైతం ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేశారట. జెసిబిలను తీసుకెళ్లి గోషాలతో పాటు షెడ్లను కూల్చినట్లు చెబుతున్నారు. నవంబర్ 30 అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు మరో ఐదుగురుపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Ponguleti Srinivasa Reddy
Also Read: Akhanda 2: వివాదంలో అఖండ 2 సినిమా…సీపీఐ నారాయణ వివాదస్పద వ్యాఖ్యలు ?





