KCR: బ‌య‌ట‌కు వ‌స్తున్న కేసీఆర్‌.. ఇక రేవంత్ రెడ్డికి చుక్క‌లే, బీఆర్ఎస్ స్కెచ్ అదుర్స్ ?

KCR vs revanth
KCR vs revanth

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్ళీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు సంవత్సరాలుగా ఫామ్హౌస్ కే పరిమితమైన కేసీఆర్, మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో కెసిఆర్ బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గులాబీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన కూడా వైరల్ గా మారింది. డిసెంబర్ 19వ తేదీన కెసిఆర్ బయటకు వస్తున్నారట. KCR

KCR coming to telangana bhavan soon

తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కాకుండా తెలంగాణ భవన్ లో గులాబీ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించేందుకు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలను ఎండగట్టేందుకు సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 19వ తేదీన తెలంగాణ భవన్లో గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే కార్యవర్గ సభ్యులతో సంయుక్త సమావేశం కేసీఆర్ నిర్వహిస్తారు. KCR

Also Read: Akhanda 2: వైసీపీ రెక్క‌లు విరిచేసిన బాల‌య్య‌..అఖండ 2 సినిమాలో అదిరిపోయే సీన్ ?

ఈ సందర్భంగా కృష్ణా గోదావరి జలాల మీద గులాబీ పార్టీ చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణ పై కెసిఆర్ చర్చించనున్నారట. ఈ సందర్భంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపైన కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారట. దీంతో గులాబీ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. కెసిఆర్ బయటకు రాకపోయినా కాంగ్రెస్లో కాస్త టెన్షన్ వాతావరణ ఉంది. అదే కేసీఆర్ యాక్టివ్ గా ఉండి పాలిటిక్స్ చేస్తే గులాబీ పార్టీ వైపు జనాలు మల్లడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు. KCR

Also Read: Sravani Chowdary: అఖండ 2 సినిమాకు ఒకే రోజు రూ.200 కోట్లు..ఆడుకుంటోన్న వైసీపీ ?

Share your love