TDP: నన్ను చంపిస్తావా.. టీడీపీ ఎమ్మెల్యే ప‌రువు తీసిన‌ మహిళ?

TDP
TDP
TDP

TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతోంది. కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు భూకబ్జాలతో రెచ్చిపోతున్న నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులపై ప్రజలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. TDP

TDP Budda Rajasekhara Reddy controversy

అయితే తాజాగా ఏపీలో ఇలాంటి సంఘటనే జరిగింది. నన్ను చంపిస్తావా అంటూ టిడిపి ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదానికి దిగింది. తమాషా చేస్తున్నావా ? ఎవరు అనుకుంటున్నావు నేను.. మీ హై కమాండ్ ఏంటి అంటూ మహిళతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగాడు. బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలో భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. TDP

Also Read: BRS: కాంగ్రెస్ లో క‌ల‌క‌లం.. కేసీఆర్ కు ద‌గ్గ‌రవుతున్న‌ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ?

ఈ కార్యక్రమం నేపథ్యంలో శ్రీశైలం టిడిపి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డితో భారతి అనే మహిళ వాగ్వాదానికి దిగింది. తన మనవడు అనారోగ్యంగా ఉండడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే ఇంటిదగ్గరకు వెళ్లాలని వెల్లడించింది. అక్కడ తన అప్లికేషన్ తీసుకోలేదని తాజాగా ఎమ్మెల్యేను నిలదీసింది మహిళ. దీంతో టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మహిళ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెరగడంతో ఎస్ఐ ని పిలిపించి ఆమెను అక్కడి నుంచి పంపించాడు ఎమ్మెల్యే. దీంతో ఈ వీడియోను వైసిపి సోషల్ మీడియా ఆడుకుంటుంది. చంద్రబాబు పాలనలో అన్ని అరాచకాలే అంటూ కౌంటర్ ఇస్తోంది వైసిపి. TDP

Also Read: Rayachoti: రాయచోటి జిల్లా వివాదం..చంద్ర‌బాబు స్పీడ్‌కు వైసీపీ బ్రేక్..ఇక ఆట షురూ ?

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment