Telangana: పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు?

Telangana
Telangana

Telangana: హైదరాబాద్ కాలేజిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు? అంటూ అవ‌మానించారు. దీంతో ఆ అవమానం తట్టుకోలేక దళిత విద్యార్థిని మృతి చెందింది. Telangana

Telangana A horrific incident took place in a Hyderabad college

సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. మల్కాజిగిరికి చెందిన విద్యార్థిని (17) కాలేజీకి ఆలస్యంగా వచ్చిందని లెక్చరర్లు శ్రీలక్ష్మి, మధురిమ క్లాస్‌లకు అనుమతించకపోగా, పీరియడ్స్ వచ్చాయని చెప్పింది. ఈ తరుణంలోనే నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు అంటూ దురుసుగా ప్రవర్తించారు. Telangana

Also Read: Congress: యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై మ‌రో ఎదురుదెబ్బ..అమెరికాకు జంప్‌ ?

దీంతో మానసికంగా కుంగిపోయి.. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన అనంతరం అకస్మాత్తుగా కుప్పకూలింది విద్యార్థిని. ఆసుపత్రికి తీసుకెళ్లగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి మృతి చెందినట్టు తెలిపారు డాక్టర్లు. ఇక కాలేజీ ముందు తోటి విద్యార్థులు, విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. Telangana

Also Read: Jagan: చంద్రబాబు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడు?

Share your love