
Teenmaar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుగా పేరుగాంచిన తీన్మార్ మల్లన్న, ఇంటి పంచాయితీ తెరపైకి వచ్చింది. ఇంటి పంచాయితీ కారణంగా తన క్యూ న్యూస్ ఛానల్ కోల్పోయే ప్రమాదం వచ్చి పడింది. దీనికి సంబంధించిన న్యూస్ గులాబీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్తి పంపకాలలో వచ్చిన గొడవల కారణంగా తీన్మార్ మల్లన్న నుంచి క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేజారినట్లు తెలుస్తోంది. Teenmaar Mallanna
Q News YouTube channel that has been taken over by Teenmaar Mallanna
అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుందట తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి. పద్ధతి మార్చుకోవాలని పదేపదే చెప్పినా కూడా తీన్మార్ మల్లన్న రెచ్చిపోయినట్లు సమాచారం అందుతోంది. దీంతో క్యూ న్యూస్ ఛానల్ లావాదేవీల పంపకాలలో వచ్చిన చిచ్చు ఇప్పుడు ఏకంగా విడిపోయేదాకా వచ్చినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. Teenmaar Mallanna
Also Read: Telangana: పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు?
రోజు అందరి కుటుంబ సభ్యులు అలాగే వ్యక్తిగత జీవితాలపై తీన్మార్ మల్లన్న మాట్లాడుతాడు అన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంటికి పంచాయితీ బయటపడింది. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. Teenmaar Mallanna
Also Read: Congress: బయటపడుతున్న మంత్రుల బండారం…మంత్రివర్గంలో మార్పుల కోసమే ఇదంతా !





