
AIADMK: ఎన్నికలకు తమిళనాడు రాష్ట్రం సిద్ధమవుతోంది. ఈ ఏడాది వేసవికాలం సమయానికి తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే టీవీకే పార్టీ పెట్టి దూసుకు వెళ్తున్నారు దళపతి విజయ్. సినిమాలకు పూర్తిగా దూరమైన దళపతి విజయ్…. నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవిపై కన్నువేశారు. AIADMK
AIADMK party releases manifesto
అటు దళపతి విజయ్ అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయని సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఎలాగైనా తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని సన్నద్ధం అవుతోంది టీవీ కే పార్టీ. ఇలాంటి నేపథ్యంలో పురుషులకు సైతం ఫ్రీ బస్సు ఇస్తామని కొత్త మేనిఫెస్టో బరిలోకి దిగింది అన్న డీఎంకే పార్టీ. AIADMK
Also Read: kavitha: ఆ మీడియా ఛానల్ పై కన్నేసిన దేవనపల్లి కవిత ?
అంతేకాదు ప్రతి మహిళకు 2000 రూపాయలు ప్రతినెల ఇస్తామని ప్రకటించింది. సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని వెల్లడించింది. అమ్మ టూ వీలర్ స్కీం కింద 5 లక్షల మందికి ద్విచక్ర వాహనంపై 25 వేల సబ్సిడీ కూడా అందించబోతున్నట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్న వారికి కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం కూడా చేస్తామని వివరించింది. వందరోజుల ఉపాధి హామీ పనుల గడువు 150 రోజులకు పెంపబోతున్నట్లు వెల్లడించింది. తమ పార్టీని గెలిపిస్తే అన్ని హామీలు నెరవేరుస్తామని వివరించింది. AIADMK
Also Read: BRS: మీకిదే చివరి అవకాశం ఇస్తున్నాను..స్పీకర్ కు బిగ్ షాక్!





