

KCR: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి… నిన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. సెట్ విచారణ అనంతరం వెంటనే నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా కెసిఆర్ తో సమావేశమయ్యారు మధుసూదన్ రెడ్డి. KCR
Mla Gudem Mahipal Reddy revanth brother met KCR
కెసిఆర్ పక్కన కూర్చుని ఫోటో కూడా దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించాలని… క్షేత్రస్థాయిలో పనిచేయండి అంటూ ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చారు కేసీఆర్. అంతకుముందు మధుసూదన్ రెడ్డి సోదరుడు గూడెం మహిపాల్ రెడ్డి కూడా… గులాబీ పార్టీని మెచ్చుకుంటూ మాట్లాడారు. KCR
Also Read: MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..హర్షవీణ మరో వీడియో
కాంగ్రెస్ పార్టీలో చేరితే ఒక్క మంచి పని కూడా జరగలేదని.. నష్టం తప్ప లాభం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవాలని ఓ సమావేశంలో గూడెం మహిపాల్ రెడ్డి కూడా అన్నారు. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ తో మధుసూదన్ రెడ్డి సమావేశం కావడం చర్చనీయాంశమైంది. తమ్ముడు ఒక్కడే గులాబీ పార్టీలో చేరుతాడా లేక ఇద్దరు సోదరులు ఒకేసారి కెసిఆర్ సమక్షంలో చేరుతారా ? అనే చర్చ మొదలైంది. KCR







