Congress MLA: మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌నం ?

BRS
Congress MLA
Congress MLA

Congress MLA: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏపీ రాజకీయాల కంటే అత్యంత దారుణంగా తయారవుతున్నాయి. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్ టీవీ ఛానల్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెరపైకి మరో వివాదం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. Congress MLA

Congress MLA Gudem Mahipal Reddy comments goes viral

కెసిఆర్ పార్టీలో మూడుసార్లు గెలిచిన పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి… కొన్ని అనివార్య కారణాల వల్ల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ… మనసు మొత్తం కెసిఆర్ పైనే ఉంది. ఇది మొదటి నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారని రేపుతున్నాయి. Congress MLA

Also Read: Weekend Comments By RK: ఎన్టీవీ ఛానల్ పై ఏబీఎన్ రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్?

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గూడెం మహిపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఇప్పుడు బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ప్రయోజనం ఏమీ దక్కలేదని ఫైర్ అయ్యారు. గులాబీ పార్టీ నుంచి మూడుసార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వెంట్రుక మందం కూడా పఠాన్ చెరువు నియోజకవర్గానికి అలాగే తనకు లాభం జరగలేదని రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు చేశారు. దీంతో మహిపాల్ రెడ్డి కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. Congress MLA

Also Read: Duvvada Srinivas: మ‌రో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి బైక్ రైడ్..అస‌లేం జ‌రిగిందంటే?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu